పుల్వామా లో ఎన్ఐఏ ఏమి సాధించింది?

పుల్వామా లో ఎన్ఐఏ ఏమి సాధించింది?

ముంబయి : ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనం నిలిపిన వ్యవహారంలో ఎన్ఐఎపై శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయం ప్రశ్న లు సంధించింది. ‘ఈ వ్యవహారం వెనుక ఉన్న కుట్ర త్వరలో బయటపడుతుంది.. ఈ కేసులో హింసాకాండ జరగకపోయినా ఎన్ఐఎ ఎందుకు దర్యాప్తు చేపట్టింది? ఏం జరు గుతుంది?.. దేశవ్యాప్తంగా ఉగ్రవాద ఘటనలపై ఎన్ఐఎ దర్యాప్తు చేస్తోంది కానీ.. ఉరి, పఠాన్కోట్, పుల్వామా ఉగ్రదాడులల్లో జిలిటెన్ స్టిక్స్ను ఎన్ఐఎ గుర్తించిందా? ఈ విష యాన్ని తాము తెలుసుకోవాలను కుంటున్నాం.. వాస్తవమేమిటీ? ఇప్పటి వరకు ఎంత మంది నేరస్తులను అరెస్ట్ చేశారు? ఈ అంశంపై మాకు అనుమానాలు న్నాయి’ అని వ్యాఖ్యానించింది. హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ విజ్ఞప్తి మేరకు ముంబయి పోలీస్ కమిషనర్గా ఉన్న సింగ్ను బదిలీచేయడానికి సిఎం ఉద్ధవ్ ఠాక్రే అనుమతించారు. పోలీస్ అధికారి పరమ్ వీర్ సింగ్కు శివసేన మద్దతుగా నిలిచింది. ‘కార్మ్చైల్ రోడ్లో దొరికిన 20 జిలిటిన్ స్టిక్స్ పేలలేదు కానీ, ఇవి మహారాష్ట్ర రాజకీయాల్లో, పరిపాలనలో పేలుళ్లకు కారణమవుతున్నాయి. దీంతో ముంబయి పోలీస్ కమిషనర్ తన పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చింది’ అని వ్యాఖ్యానించింది. పరమ్ బీర్ సింగ్ను బదిలీ చేసినంత మాత్రాన ఆయన నేరం చేసినట్టు కాదు అని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos