తెరపై ఎంతో అందంగా కనిపించే నటీనటులు తెర ముందు కనిపిస్తే గుర్తు పట్టలేనంతగా ఉంటారు.ముఖ్యంగా తెరపై మేకప్ తో మాయ చేసే హీరోయిన్లలో రేవరో కొంతమంది మినహా చాల మంది హీరోయిన్లు మేకప్ లేకుండా చూస్తే అభిమానులు సైతం జడుసుకునేలా ఉంటారు.తాజాగా ఎన్టీఆర్ కథానాయిక సమీరా రెడ్డి మేకప్ లెస్ లుక్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. తాను కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు వికృతమైన తన రూపాన్ని కవర్ చేసుకునేందుకు చాలానే శ్రమించానని తెలిపింది. తనకు ఎందులోనూ పరిపూర్ణత లేదని.. శరీర ఆకృతిలో లోపాల్ని కప్పి పుచ్చేందుకు ప్యాడ్స్ ఉపయోగించానని తెలిపింది. ముఖాకృతిని అందంగా చూపించేందుకు మేకప్ ని.. కళ్ళు కాంతివంతం చేయడానికి లెన్స్ కూడా ఉపయోగించిందట. తన వాచిన కళ్లను కవర్ చేసేందుకు రకరకాల మేకప్ విధానాల్ని అనుసరించానని సమీరా వెల్లడించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారాయి.అసలు తాను అలా చేయడానికి కారణమేమిటి? అంటే సోషల్ మీడియాల్లో తనపై రకరకాల కామెంట్లు వినించేవిట. తాను అంత అందంగా లేనని పలువురు మహిళలు తనని తిట్టేవారని అవి తనను ఎంతో బాధించేవని సమీరా తెలిపారు.