గుంటూరు: అక్రమంగా నిధుల్ని మళ్లించారనే ఆరోపణపై తెదేపా మాజీ లోక్సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావుకు వ్యతిరేకంగా శుక్రవారం ఈడీ కేసు దాఖలు చేసింది. ఫెమా చట్టం కింద ఆయనతో బాటు, ట్రాన్స్టాయ్ సంస్థపైనా కేసు దాఖలు చేసారు. రూ.16 కోట్లు సింగపూర్, మలేషియాకు మళ్లించినట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటికే రాయిపాటితో పాటు కుమారుడు రామారావు, ట్రాన్స్ట్రాయ్ కంపెనీలపై సీబీఐ కేసు నమోదైంది. 15 బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.8832 కోట్ల రుణంలో రూ.3822 కోట్లు నిధుల్ని సింగపూర్, మలేషియా, రష్యాలకు నిధులు మళ్లించినట్లు అభియోగాలున్నాయి.