హైదరాబాద్: నటి సమంత వ్యాయామాల్ని చేయటంలో దిట్ట. తాజాగా ఆ పనిలో భాగంగా 100 కిలోల బరువును ఎత్తి అభిమానుల్ని ఆశ్చర్చ పరచారు. సంబంధిత వీడియోను సామాజిక మాధ్యమాల్లో జతపరిచారు.‘మరలా నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది నా పాత నేస్తమా. 100 కేజీల సుమో డెడ్ లిఫ్ట్’ అని పేర్కొన్నారు.‘వామ్మో.. సమంత నువ్వు సూపర్’,‘సమంత నువ్వు పవర్ ఫుల్’ అని వీక్షకులు వ్యాఖ్యానించారు.