సల్మాన్ అంగరక్షకుడి వేతనం ఎంతో తెలుసా?

  • In Film
  • October 12, 2019
  • 154 Views
సల్మాన్ అంగరక్షకుడి వేతనం ఎంతో తెలుసా?

బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన సల్మాన్ ఖాన్ బయట ఎప్పుడు కనిపించినా సల్మాన్‌కు నీడలా షెరా అనే అంగరక్షకుడు ఉంటాడు.హిందీ పరిశ్రమకు,ముంబయి జనాలకు తప్ప అతడి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు.కానీ షెరాను సల్మాన్ ఎంత బాగా చూసుకుంటాడో అతడికి ప్రతినెలా సల్మాన్ ఎంత వేతనం ఇస్తాడో తెలిస్తే షాక్ తగులుతుంది.నెలకు రూ.15 లక్షల చొప్పున సల్మాన్.. షెరాకి జీతమిస్తాడు. ఇవి కాకుండా.. బోనస్లు,బెనిఫిట్స్ మొత్తం కలుపుకుంటే ఏడాదికి రూ.2 కోట్లకు పైగానే ఇస్తున్నాడు.అంతేకాదు షెరా కోసం సల్మాన్ ఓ ఇల్లు కూడా రాసిచ్చాడట.సల్మాన్ అంటే తనకు ఎంత ఇష్టమో షెరా సైతం పలు సందర్భాల్లో వెల్లడించాడు.తన తుదిశ్వాస వరకు సల్మాన్ వద్దే ఉంటానని ఓ సందర్భంలో చెప్పారు. తనెప్పుడూ సల్మాన్ పక్కన కానీ, వెనుక కానీ ఉండనని.. సల్మాన్ ముందు ఉంటానని.. ఆయనకి హాని కలిగించేవారు ఎవరైనా ఉన్నారా..? అని ప్రతీక్షణం గమనిస్తూనే ఉంటానని అన్నారు.షెరా కుమారుడిని సినిమాల్లోకి తీసుకురావాలని సల్మాన్ ఆలోచిస్తున్నారట.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos