ఎంగిలితో కరోనా పరీక్ష

ఎంగిలితో కరోనా పరీక్ష

న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థ -నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్ఈఈఆర్ఐ)-నీరి సంస్థ కరోనా పరీక్షకు కొత్త విధానాన్ని కనిపెట్టింది. ఎంగిలి గొట్టంతో 3 గంటల్లో కరోనా పరీక్షా ఫలితాన్ని తెలిపే విధానాన్ని ఆవిష్కరించింది. పుక్కి లించిన ఎంగిలితో ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తారు. అత్యాధునిక ల్యాబ్ అవసరం లేకుండా అతి తక్కువ ఖర్చుతో టెస్ట్ చేసుకోవచ్చు. దీని వల్ల గ్రామీణ, గిరిజన ప్రాంతాల వారికి మరింత సౌలభ్యం చేకూరనుంది. దీని వల్ల సొంతంగా ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు. నీరి ఆవిష్కరించిన ఈ నూతన టెస్టింగ్ పద్దతికి ఐసీఎంఆర్ సంస్థ కూడా ఆమోదం తెలిపింది. తర్వలోనే ఇది మార్కెట్లోకి విడుదలల కానుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos