ఉన్నావో: వచ్చే లోక్‍సభ ఎన్నికల్లో పోటీకి తనకు అవకాశం లభించకున్నాపార్టీ అభ్యర్థుల గెలుపు కోసం గతంలో మాదిరే ప్రచారాన్ని చేస్తానని ఉన్నావో లోక్‌సభ సభ్యుడు సాక్షి మహరాజ్ (భాజపా) తెలిపారు. బుధవారం ఇక్కడ ఆయన మాధ్యమ ప్రతినిధులతో తనకు తప్పనిసరిగా టిక్కెట్ వస్తుందని, ఇందుకు భిన్నంగా పార్టీ నిర్ణయాన్ని తీసుకుంటే ఎన్నికల ప్రచారాన్ని చేస్తానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఉన్నావో నుంచి పోటీకి టిక్కెట్ ఇ వ్వక పోతే ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయని ఆయన ఉత్తర ప్రదేశ్ భాజపా అధ్యక్షుడు మహేంద్ర నాథ్ పాండేకు ఈ నెల ఏడున లేఖ రాసినట్లు వార్తలు వెలువడ్డాయి. తనకు టిక్కెట్ ఇవ్వకుంటే కోట్లాది మంది కార్యకర్తల మనోభావాలు గాయపడతాయని, అందువల్ల ఆశావహ ఫలితం రాకపోవచ్చని అందులో పేర్కొన్నారు. ఓబీసీ అభ్యర్థి తాను ఒక్కడే అయినందున ఉన్నావో నుంచి పోటీకి మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.తాను పార్టీ నాయకత్వానికి ఎలాంటి హెచ్చరిక చేయలేదని, కేవలం సూచన మాత్రమే చేసానట్లు వివరించారు. గత లోక్‌సభ ఎన్నికలో ఉన్నావో నుంచి ఆయన భారీ ఆధిక్యతతో విజయాన్ని సాధించారు.