రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా సమస్య జటిలం

రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా సమస్య జటిలం

తాడేపల్లి : రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా సమస్య జటిలం అవుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్ర వారం ఇక్కడ విలేఖులతో మాట్లాడారు.‘ ఉద్యోగులు బలప్రదర్శన చేద్దామని చూడ్డం సరికాదు. చర్చలకు ప్రభుత్వం ఎప్పుడైనా సిద్ధంగా ఉంటుంది. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే. బయటి శక్తుల ప్రమేయంతో ఉద్యోగులకు ఇబ్బందులొస్తాయి. సంబంధం లేని సమస్యల్ని హైలెట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఉద్యోగులు నియంత్రణ కోల్పోయి వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్తున్నారు. ఉద్యోగ సంఘాలతో మాట్లాడేందుకు మేం ఎప్పుడూ సిద్ధం. ఆందోళనలు, సమ్మెల వల్ల ఉపయోగం ఉండదు. ప్రభుత్వ సమస్యలను ఉద్యోగులు అర్థం చేసుకోవాల’ని విజ్ఞప్తి చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos