అమరావతి : శ్రమదానం ద్వారా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఏమి నిరూపించాలనుకుంటున్నారో అర్థం కావటం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యా నించారు. కరోనా వ్యాపించిన దశలో వేల మందితో బహిరంగ సభ నిర్వహించడాన్ని తప్పు బట్టారు. బలప్రదర్శనల వల్ల మళ్లీ కొవిడ్ విజృంభించే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్ల మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,200కోట్లు కేటాయించిందని తెలిపారు.