సైరా వేడుక వాయిదా

  • In Film
  • September 17, 2019
  • 204 Views

హైదరాబాద్ : చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి ప్రి రిలీజ్ వేడుక వాయిదా పడింది. ఈ నెల 18న ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకను భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ఈ నెల 22కు వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అయితే తొలుత అనుకున్న షెడ్యూల్ మేరకు ట్రైలర్‌ను బుధవారం విడుదల చేస్తామని పేర్కొంది. ప్రి రిలీజ్ వేడుకకు పవన్ కళ్యాణ్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, వి.వి. వినాయక్ హాజరు కానున్నారు. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న సైరా చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతి బాబు, సుదీప్ ప్రభృతులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబరు 2న ఈ చిత్రం విడుదల కానుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos