కడప: వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని మానసికంగా దెబ్బ తీసేందుకు ఆయన బాబాయ్ వివేకానందరెడ్డిని నరికి చంపారని ఎంపీ విజయ సాయి రెడ్డి శనివారం ట్విట్టర్లో ఆరోపించారు. కడప జిల్లాలో అధికార పార్టీకి ఆయన హిమాలయ శిఖరంలా అడ్డునిల్చారన్నారు. భౌతికంగా అంతం చేస్తే తప్ప పట్టు దొరకదని భావించి అమానవీయంగా హత మార్చారని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ లే కుట్రకు బాధ్యులు అని దుయ్యబట్టారు.‘ రాజారెడ్డి హంతకులు తెలుగుదేశంలో ఉన్నత హోదాల్లో ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలు అలాగే ఉన్నాయి. హత్యా యత్నంలో వైఎస్ జగన్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సాఫ్ట్ టార్గెట్ వివేకానందను బలి తీసుకున్నారు. రక్త దాహం తీరదా చంద్రబాబూ? అని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.