ఫిదా చిత్రంతో తెలుగులో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న మలయాళీ కుట్టి సాయిపల్లవి ఏం చేసినా సంచలనమే.ప్రజలను తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉంటూ ఇతర హీరోయిన్ల కంటే తాను భిన్నమని ఇదివరకే రుజువు చేసిన సాయి పల్లవి తాజాగా మరోసారి ఈ విషయాన్ని రుజువు చేసుకుంది. పెద్ద కార్పొరెట్ సంస్థ తన ఉత్పత్తుల కోసం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకునేందుకు సాయి పల్లవికి కోటి రూపాయలు ఆఫర్ చేసిందట. అయితే ఎప్పటిలాగే ఈ ఆఫర్ ని కూడా సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.గతంలో ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ నటించేందుకు రెండు కోట్ల ఆఫర్‌ను కాదనుకుందని వార్తలు వినిపించాయి. అందమనేది సహజంగా ఉండాలి.. అలాంటి ఉత్పత్తులను వాడమని తాను చెప్పలేనని అందుకే యాడ్స్‌లో నటించనని ఓ చోట చెప్పుకొచ్చింది.