శిరిడీ :కరోనా కారణంగా ఇక్కడి సాయిబాబా ఆలయాన్ని మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు మూసివేయాలని ఆలయ సమితి తీర్మానించింది.యాత్రికులు తమ ప్రయాణాలను తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని కోరింది. ఆలయాన్ని తెరచిన తర్వాత యాత్రికులకు బాబా దర్శనం యథాతథంగా సాగుతుందని వివరించారు.