వైకాపా గెలుస్తోందనే జగన్‌పై దాడి

అమరావతి:సాధారణంగా ఎన్నికల్లో గెలిచే అవకాశమున్న పార్టీ పైనే ఇతర పక్షాలు ధ్వజమెత్తుతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, చివరికి కేఏ.పాల్ కూడా వైకాపాకు వ్యతిరేకంగా ఒంటికాలిపై లేస్తున్నారు. అంటే వైకాపా వైసీపీ విజయం ఖరారైనట్లు అంగీకరించినట్లు భావించాల్సి ఉంటుందని వైకాపా ప్రముఖుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి శనివారం ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. ఈ ఒక్క విషయంలో అయినా ముగ్గురు నేతలకు స్పష్టమైన అవగాహన ఉండటం గమనార్హమని ఎద్దేవా చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos