
అమరావతి: జనసేన తీర్థాన్ని పుచ్చుకున్న సీబీఐ మాజీ సంయుక్త సంచాలకులు లక్ష్మీనారాయణను సోమవారం ట్వీట్‌లో వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎగతాళి చేసారు.’ఇప్పుడు జన సైనికుడిగా మారడ మేమిటి లక్ష్మినారాయణ గారూ. మీరు మొదటి నుంచి చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకునే జవానే గదా. పచ్చ పార్టీలో చేరితే ప్రజలు ఛీ కొడతారని అనుబంధ సంస్థలో చేరారు. ఇన్నాళ్లు ఎవరి కోసం పని చేసారో, ఇక పై ఏం చేస్తారో తెలియదనుకుంటే ఎలా?’ అని వ్యాఖ్యానించారు. ’35 ఏళ్లుగా చంద్రబాబు పులివెందుల రుగ్మతతో బాధ పడుతున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా ఈ భీతి నుంచి బయట పడలేక పోయారే మిటి తుప్పు నాయుడు గారూ? అర్థంలేని భయాలను ప్రజలకు అంటించాలని చూస్తున్నారు. మంచి డాక్టర్ ను కలవండి చికిత్స లభిస్తుంది ’ అని అవహేళన చేసారు.