పైలెట్కు హస్తం బుజ్జగింపు

పైలెట్కు హస్తం బుజ్జగింపు

న్యూ ఢిల్లీ: రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ తిరుగుబాబాటుతో తలెత్తిన రాజకీయ సంక్షోభం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అప్రమత్తమైంది. అధిష్ఠానం ఆదేశంతో పార్టీ కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా రంగంలోకి దిగారు. ‘రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం నడిపించేందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరూ సమావేశానికి హాజరై ప్రభుత్వాన్ని మరింత పటిష్ఠం చేయాలి. ఏ పదవిలో ఉన్నవారైనా సరే తమ సమస్యను పార్టీ వేదికపై ప్రస్తావించండి. దాన్ని కలిసి పరిష్కరించి రాష్ట్రంలో ప్రభుత్వం ఇబ్బంది పడకుండా చూసేందుకు ప్రయత్నిస్తాం. కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే కుటుంబ సభ్యుల మధ్యే చర్చించుకోవాలి. సచిన్కు, ఇతర నాయకుల కోసం కాంగ్రెస్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పార్టీ నాయకత్వం తరపున స్పష్టం చేస్తున్నాన’ని విన్నవించారు. ‘గత 48 గంటలుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సచిన్ పైలట్తో సంప్రదింపులు జరుపుతోంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడాం. ప్రభుత్వాన్ని పడగొట్టాలని భారతీయ జనతా పార్టీ చేస్తున్న కుట్రలు విజయవంతం కావు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తుందని విశ్వాసాన్ని’ వ్యక్తీకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos