జైపూర్: భాజపాలోకి ఫిరాయించనున్నట్లు రెండు రోజులుగా సంకేతాలు పంపిన రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ సోమవారం అనూహ్యంగా తన మనసును మార్చుకున్నారు. ‘నేను భాజపాలో చేరబోవడం లేద’ని తేల్చి చెప్పారు. వాస్తవానికి సోమవారం ఇక్కడ కాంగ్రెస పార్టీ శాసనసభ్యుల సమావేశం జరిగే సమ యానికి, సచిన్ పైలట్ న్యూ ఢిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కావాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నభాజపా నాయకత్వం వేచి చూసే ధోరణిని అవలంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ‘రాజస్థాన్ లో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. మేమేమీ కాంగ్రెస్ పార్టీని చీల్చాదలచటం లేద’ని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ‘రాజస్థాన్ లో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. మేమేమీ కాంగ్రెస్ పార్టీని చీల్చదలచ లేద’ని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. సచిన్ సన్నిహిత వర్గాలు కూడా భాజపాతో సంబంధాలపై వ్యాఖ్యానిం చడానికి నిరాకరించారు. ‘సచిన్ పైలట్ కు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో విభేదాలు ఉన్నాయి. తనకు తగినంత ప్రాతినిధ్యాన్ని ఇవ్వడం లేదని ఆయన భావిస్తు న్నారు. ఆయన భాజసాలోకి వస్తానంటే ఆహ్వానిస్తామ’ని భాజపా సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.