ముంబై : మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కల్పించిన వ్యక్తి గత భద్రతను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉపసంహరించింది. సచి న్ భద్ర తను సమీక్షించిన పోలీసు ఉన్నతాధికారుల సమితి ఈ మేరకు తీర్మానించింది. ఇప్పటి వరకూ ఆయనకు 24 గంటల పాటు పోలీసు జవాన్లతో ఎక్స్ శ్రేణి భద్రత కల్పించారు. పర్యటనల్లో మాత్రం భద్రతను మాత్రం కొనసాగిస్తారు. 97 మంది నేతలకు ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. వీరిలో 29 మంది భద్రత శ్రేణిని మార్చారు.