న్యూ ఢిల్లీ: శబరిమలె దర్శించే మహిళలకు భద్రత కల్పించాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించజాలమని అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం తేల్చి చెప్పింది. శబరిమల వెళ్లే మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతూ ఫాతిమా, అమిని అనే మహిళలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై న్యాయస్థానం విచారణ మొదలైంది. ఈ వ్యాజ్యాలపై త్వరలోనే విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పుపై నిలుపుదల ఉత్తర్వు లేదని స్పష్టీ కరించింది. అందువల్ల మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ దశలో ప్రధాన న్యాయమూర్తి బాబ్డే జోక్యం చేసుకుని కుని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఫిర్యాదు దార్లకు పోలీసు భద్రత కల్పించాలని మాత్రమే న్యాయ స్థానం ఆదేశించింది. ఇంతకుముందు అన్ని వయసుల మహిళలు శబరిమల వెళ్లొచ్చని తీర్పునిచ్చింది.