హైదరాబాదు: పరుశరాం దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న సినిమాలో ఆయన సరసన కథానాయికగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ను చిత్ర బృందం ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తయినట్టు సమాచారం. ఎమోషనల్ గా సాగే కమర్షియల్ సినిమా ఇది. చిత్రీకరణ వచ్చే అక్టోబర్ లో మొదలు కానుంది. కథనాయికగా తొలుత కీర్తి సురేశ్, కైరా అద్వానీలో ఒకరిని ఎంచుకుంటారన్న వార్తలు వచ్చాయి. అనూహ్యంగా బాలీవుడ్ యువ తార సారా తెరపైకి వచ్చింది.