సాహో ట్విట్టర్‌ రివ్యూ..

  • In Film
  • August 29, 2019
  • 149 Views
సాహో ట్విట్టర్‌ రివ్యూ..

భాస్‌ నటించిన భారీ చిత్రం సాహో శుక్రవారం  ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో అభిమానులు, ప్రేక్షకులు సాహో కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ చిత్రంపై అంచనాలు మరింత పెంచడంతో ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ఆతృతగా ఉన్నారు. అయితే అరబ్ స్టేట్స్ లో సెన్సార్ కోసం ప్రదర్శించిన సాహోను చూసిన కొంతమంది వ్యక్తులు చిత్రంపై పెదవి విరుస్తుండడం గమనార్హం. సినిమా ఫస్ట్ హాఫ్ ఏవరేజ్ గా ఉందని.. సెకండ్ హాఫ్ బాగుందని అంటున్నారు.ప్రభాస్ నటన, ఇంటర్వెల్ కి ముందు వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్, యాక్షన్ పార్ట్ బాగున్నాయని కానీ పాటలు, రొటీన్ స్టోరీ బాగా విసిగించాయని కామెంట్స్ పెడుతున్నారు.వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా కొన్ని సన్నివేశాల్లో బాలేదని అంటున్నారు. హిందీ వెర్షన్ చూసిన వారు.. ప్రభాస్ డబ్బింగ్ పెద్దగా సూట్ కాలేదని.. రన్నింగ్ టైం చాలా ఎక్కువగా ఉందని ఓవరాల్ గా సినిమా బాగాలేదని తేల్చేస్తున్నారు. సినిమాలో యాక్షన్ తప్ప సరైన స్టోరీ లేదని..స్క్రీన్ ప్లే వర్క్ బాలేదని.. కామెడీ లేదని, విలన్స్ ఎక్కువయ్యారని.. నిడివి ఎక్కువ కావడంతో సినిమా బోరింగ్ గా అనిపించిందని అంటున్నారు. ప్రభాస్ కోసం, యాక్షన్ సీన్స్ కోసం సినిమా చూడొచ్చని చెబుతున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos