ఛండిగడ్ : హరియాణా రైతులు గురువారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కన్నెర్ర చేశారు. రాష్ట్ర మంత్రివర్గం ఇటీవలే ఆమోదించిన మూడు వ్యవసాయ అత్యవస రాదేశాలకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. భారీ సంఖ్యలో రైతులు కురు క్షేత్ర వద్ద ఉన్న 44వ నెంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో రహదారులు హోరెత్తాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.