న్యూ ఢిల్లీ: నూతన సాగు చట్టాలపై పోరాడి అరెస్టైన రైతుల్ని ఎటువంటి షరతులు లేకుండా విడుదల చేయాలని రాష్ట్రపతికి సంయుక్త కిసాన్ మోర్చా లేఖ రాసింది. వారిపై నమోదైన కేసులను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేసింది. ‘కొత్త వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలని గత 6 నెలలుగా మేము ఉద్యమం చేస్తున్నాం. అయితే ఆందోళన చేస్తున్న రైతులపై తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం అరెస్టు చేయించింది. వారంతా ఏ తప్పు చేయలేదు. తక్షణమే ఎలాంటి షరతులు లేకుండా రైతుల్ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించండి.”-రాష్ట్రపతికి లేఖలో సంయుక్త కిసాన్ మోర్చా విన్నవించింది. దిల్లీలో మూసివేసిన రోడ్లను తెరవాలని కోరింది