మెలిటోపోల్ రష్యా సేనల వశం

మెలిటోపోల్ రష్యా సేనల వశం

కీవ్ : ఉక్రెయిన్ ఆగ్నేయ దిశలోని జపొరిజ్జ్య ప్రాంతంలో ఉన్న మెలిటోపోల్ నగరం తమ వశమైందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఐగోర్ కొనషెంకోవ్ శనివారం ఇక్కడ ప్రకటించారు. రష్యన్ సాయుధ దళాలు ఈ నగరంపై సంపూర్ణ ఆధిపత్యం సాధించిందన్నారు. ప్రజల రక్షణ, భద్రత కోసం తమ సైన్యం అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్ జాతీయవాదులు, స్పెషల్ సర్వీసెస్ ప్రతిఘటనను తిప్పికొట్టేందుకు కూడా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రష్యా గురువారం నుంచి ఉక్రెయిన్పై దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ దళాలను తిప్పికొట్టేందుకు డోనెట్స్క్, లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్స్ సహాయం కోరాయని, దీనికి ప్రతిస్పందిస్తూ యుద్ధం చేస్తున్నామని రష్యా చెప్తోంది. ఉక్రెయిన్ సైనిక మౌలిక సదుపాయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, సాధారణ ప్రజానీకానికి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. ఉక్రెయిన్ను ఆక్రమించాలనే ఆలోచన తమకు లేదని పునరుద్ఘాటించింది. డీమిలిటరైజ్, డీ-నాజిఫై ఉక్రెయిన్ లక్ష్యంగా ఈ ప్రత్యేక ఆపరేషన్ను రష్యా ప్రారంభించిందని విశ్లేష కులు చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos