న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్ర దాడికి కారణమైన జైషే ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రకటించాలంటూ భారత్ చేసిన డిమాండ్‌కు అగ్ర దేశమైన రష్యా తాజాగా మద్దతు తెలిపింది. ఈ వాదనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నామని రష్యా మంత్రి డెనిస్ మాంటురోవ్ తెలిపారు. మరో అగ్ర దేశమైన ఫ్రాన్స్ కూడా జైషే చీఫ్ మసూద్ అజహర్‌పై నిషేధం విధించాలంటూ అంతకు ముందే ఐక్యరాజ్యసమితికి తీర్మానం పంపింది. భద్రతా మండలిలో రష్యా, ఫ్రాన్స్ దేశాలకు వీటో అధికారం ఉంది.