ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో మొబైల్ ఫోన్‌లో రమ్మీ ఆడుతూ కెమెరాకు చిక్కిన వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావ్ కోకాటేపై వేటు పడింది. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఆయనను వ్యవసాయ శాఖ నుంచి తప్పించి క్రీడలు, యువజన సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుత క్రీడామంత్రి దత్తాత్రేయ భర్నేకు వ్యవసాయ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది