ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది…

ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది…

హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగనుంది. ఈ మేరకు కార్మిక సంఘాల ఐకాస స్పష్టం చేసింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో ఐకాస నాయకులు సమావేశమయ్యారు. తెదేపా, తెజస, సీపీఎం, సీపీఐ సహా పలు ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. సమ్మెకు తమ మద్దతు కొనసాగుతుందని రాజకీయ పార్టీల నాయకులు పునరుద్ఘాటించారు. సమావేశం అనంతరం ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేత అశ్వత్థామ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, బెదిరింపులకు భయపడేది లేదని చెప్పారు. శుక్రవారం ఆర్టీసీ డిపోల వద్ద అధికారులకు వినతిపత్రాలు అందజేసి నిరసన తెలుపుతామన్నారు. గాంధీ విగ్రహాల వద్ద మౌన ప్రదర్శనలు చేస్తామన్నారు. కార్మికులతో కలిసి సమ్మెలో పాల్గొంటున్న సూపర్‌వైజర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక సంఘాలు తమతో కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos