ఆగిన మరో కార్మికుడి గుండె..

ఆగిన మరో కార్మికుడి గుండె..

డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కార్మికులు-తెలంగాణ ప్రభుత్వం మధ్య దూరం రోజురోజుకు మరింత పెరుగుతోంది.అటు కార్మికులు ఇటు సీఎం కేసీఆర్ ఇద్దరు మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారు.సమ్మె విరమించకుంటే ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తామని హెచ్చరించినా కార్మికులు వెనక్కి తగ్గకపోవడంతో కేసీఆర్ అన్నంత పని చేయడానికి చర్యలకు ఉపక్రమించారు.ఈ నేపథ్యంలో ఆర్టీసీలో పనిచేసే తన భార్య ఉద్యోగం పోతే కుటుంబ పోషణ భారమవుతుందనే ఆవేదనతో సంగారెడ్డి పరిధిలోని బాబా నగర్ లో నివాసం ఉండే కిషోర్ అనే కారు డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందారు.ఇది గడిచిన కొద్ది గంటలకే ఉద్యోగం పోతుందనే బెంగతో మరో కార్మికుడు మృత్యువాత పడడం చర్చనీయాంశమైంది. హెచ్.సి.యు డిపో డ్రైవర్ షేక్ ఖలీల్ మియా అనే వ్యక్తి హార్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. తీవ్ర మనస్తాపానికి గురైన ఖలీల్ మియా వయస్సు 48 సంవత్సరాలు. రామచంద్రపురం ఈఎస్ఐ వద్ద నివాసముంటున్న ఖలీల్ మియా కుటుంబం ఆయన మృతితో కన్నీరు మున్నీరు అవుతోంది. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చోటు చేసుకుంటున్న ఈ మరణాలు ప్రభుత్వ హత్యలే అని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగాల విషయంలో న్యాయ పోరాటం చేసి, తిరిగి తమ ఉద్యోగాలు సాధించుకుందామని ఆర్టీసీ కార్మిక సంఘాలు చెబుతున్నప్పటికీ సగటు ఆర్టీసీ కార్మికుల ఆందోళన మాత్రం తగ్గటం లేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos