అమరావతి: ‘పోలవరం జలాశయ నిర్మాణం రివర్స్ టెండరింగ్ వ్యవహారంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి బుధవారం ఆదేశించారు. రివర్స్ టెండరింగ్ వల్ల ఆదా అయ్యే ప్రతీ పైసా కూడా ప్రజలకే చెందుతుందనే విషయాన్ని వారికి తెలపాలని సూచించారు. దేశంలోనే అత్యున్నత విధానాలతో అవినీతి రహిత పాలన అందిస్తానని పునరుద్ఘాటించారు. ఇందుకు అందరూ సహకరించాలని కోరారు.తనపై అనేక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అవినీతి నివారణ, నిర్మూలన చర్యల్లో వెనుకంజ వేసేది లేదని పునరుద్ఘాటించారు.ఆరు నూరైనా రివర్స్ టెండరింగ్ ఆగదని తేల్చి చెప్పారు.