బెంగళూరు : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వార్షిక సమావేశాల్నీ కరోనా ప్రభావితం చేసింది. నగరంలో ఈ నెల 15 నుంచి 17వతేదీ వరకు నిర్వహించదలచిన ఆర్ఎస్ఎస్ నిర్ణాయక అఖిల భారతీయ ప్రతినిధుల సభ వార్షిక సమావేశాల్ని రద్దు చేసినట్లు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ జోషి శనివారం ప్రకటించారు. గతంలో అత్యాయిక పరిస్థితి, మహాత్మాగాంధీ హత్య జరిగిన సమయాల్లో మాత్రమే ఆర్ఎస్ఎస్ వార్షిక సమావేశాలను రద్దు చేసారు. దేశంలో 83 మందికి కరోనా వైరస్ సోకింది. ఇద్దరు మరణించారు.