రగిలిపోతున్న సంఘ్ పరివార్‌

రగిలిపోతున్న సంఘ్ పరివార్‌

న్యూఢిల్లీ : సంరగిలిపోతున్న సంఘ్ పరివార్ పరివార్ లోలోన రగిలిపోతోందా ? ఆర్ఎస్ఎస్ నేతల విమర్శలన్నీ బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని మోడీ-షా ద్వయాన్ని లక్ష్యంగా చేసుకుని చేసినవేనని స్పష్టమవుతోంది. పార్టీలో విధాన నిర్ణయాలన్నింటినీ వీరిద్దరే తీసుకునే వారు. తమను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ పలువురు నేతలు లోలోన తీవ్రమైన అసంతృప్తికి గురయ్యారు.
సుధీంద్ర కులకర్ణి ఏమన్నారంటే…
భగవత్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాలని ఒకప్పుడు సంఫ్‌ు పరివార్లో క్రియాశీలక పాత్ర పోషించిన సుధీంద్ర కులకర్ణి అన్నారు. గత పది సంవత్సరాల కాలంలో ప్రధానిని ఆర్ఎస్ఎస్ చీఫ్ విమర్శించడం ఇదే మొదటిసారని ఆయన గుర్తు చేశారు. మోడీ ప్రచారం యావత్తూ అబద్ధాలతో సాగిందని, ఎక్కడా హుందాతనం కన్పించలేదని భగవత్ అభిప్రాయపడ్డారని తెలిపారు. మోడీ ప్రభుత్వ ఏకపక్ష పనితీరుపై పరివార్ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నదని చెప్పారు. మోడీ-షా ద్వయం ఆర్ఎస్ఎస్ నేతల అభిప్రాయాలకు ఎన్నడూ ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు. వారు ఆర్ఎస్ఎస్తో చర్చలు జరపలేదని, సంస్థను గౌరవించలేదని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్పై బీజేపీ ఇంకెంత మాత్రం ఆధారపడబోదని నడ్డా చేసిన ప్రకటనపై కులకర్ణి నిప్పులు చెరిగారు. నడ్డా ప్రకటనలో ఆగ్రహించిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారని, అమేథీలో అయితే బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారని చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రితం ముస్లిం పెద్దలతో భగవత్ సంప్రదింపులు మొదలు పెట్టారని, కానీ ప్రభుత్వం ఆయనకు మద్దతు తెలపలేదని అన్నారు. ఆర్ఎస్ఎస్ సర్సంఫ్‌ుచాలక్తో అభిప్రాయబేధాలు ఉన్నప్పటికీ వాజ్పేయి, అద్వానీ వంటి నేతలు ఆయనను ఎల్లప్పుడూ గౌరవించేవారని కులకర్ణి గుర్తు చేశారు.
వారిది రెండు నాల్కల ధోరణి
ఆర్ఎస్ఎస్ రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తోందని సీనియర్ పాత్రికేయుడు ధీరేంద్ర కే ఝా అభిప్రాయపడ్డారు. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో ఆర్ఎస్ఎస్ నేతలు ఇప్పుడు దాని వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారని ఆయన తెలిపారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మణిపూర్ ఘర్షణలకు ఆజ్యం పోశారని, ఇప్పుడేమో ఆ ఘర్షణలపై భగవత్ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని, ఇది రెండు నాల్కల ధోరణి తప్పించి మరోటి కాదని విమర్శించారు. సాంస్కృతిక సంస్థగా వ్యవహరిస్తానని హామీ ఇచ్చిన మీదటే ఆర్ఎస్ఎస్పై నిషేధాన్ని ఎత్తివేశారని అంటూ ఇప్పుడేమో అది రాజకీయ సంస్థ మాదిరిగా పనిచేస్తోందని ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos