ఆరెస్సెస్‌ మరో వంచన

ఆరెస్సెస్‌ మరో వంచన

నాగపూర్ : లోక్సభ ఎన్నికల్లో బిజెపి ఓటమి తరువాత ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఆరెస్సెస్ మరో వంచనకు అతి పెద్ద నిదర్శనం. ‘అహంకారం లేనివాడే నిజమైన సేవకుడు, ఇతరులను నొప్పించకూడదు. సమాజంలో విభజనలు సృష్టించడం తగదు, ప్రత్యర్థులను విరోధులుగా చూడకూడదు ఇతరులను కూడా గౌరవించాలి’.. నాగపూర్లో ఆరెస్సెస్ కార్యకర్తల సమావేశంలో ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ అన్న మాటలివి. ఆరెస్సెస్ పత్రిక ‘ఆర్గనైజర్’తాజా సంచికలో ప్రచురితమైన ఒక వ్యాసం కూడా ఇదే రీతిన సాగింది. బిజెపి ఓటమికి ఆ పార్టీ నాయకుల అతి విశ్వాసమే కారణ మని అది తేల్చేసింది., ఎన్నికల్లో పనిచేసేందుకు సైద్ధాంతిక మిత్రులు (ఆరెస్సెస్ అనుబంధ సంఘాల) సహకారం అవసరమని, ఈ సారి ఎన్నికల్లో బిజెపి ఆ పని చేయలేదని ఆ వ్యాస రచయిత అరెస్సెస్ క్రియాశీలక సభ్యుడ రతన్ శారదా సెలవిచ్చారు. ఇవన్నీ ఆరెస్సెస్ ఆడుతున్న నాటకంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు కొందరు పేర్కొన్నారు. బిజెపి గత రెండు పర్యాయాలు గెలిచినప్పుడు అది హిందూత్వ ఎజెండాకు లభించిన విజయంగా చెప్పుకున్నవారు, ఇప్పుడు ఓటమి ఎదురయ్యేసరికి అది ఆ పార్టీ నాయకత్వ వైఫల్యంగా చిత్రించడం సంఫ్‌ు పరివార్కు అలవాటైన విద్య అని వారు పేర్కొంటున్నారు.
బిజెపి సమర్ధత తగ్గినప్పుడే ఆర్ఎస్ఎస్ అవసరం వస్తుందని మోహన్ భగవత్ అనడం కూడా ఈ గేమ్ ప్లాన్లో భాగమే.. ఆరెస్సెస్కు అత్యంత సంతృప్తినిచ్చే ప్రభుత్వమే గత పదేళ్లుగా కేంద్రంలో ఉన్నది. గత టర్మ్లో పరివార్ దీర్ఘకాలిక ఎజెండాలో ముఖ్యమైనవాటిని మోడీ ప్రభుత్వం ఆచరణలో పెట్టింది. అయోధ్యలో బాబ్రీ మసీ2దు కూల్చిన చోట నిర్మించిన ఆలయాన్ని ప్రధాని స్వయంగా ప్రారంభించారు. మోహన్ భగవత్ దగ్గర ఉండి ఇదంతా నడిపించారు. ఆ ప్రసంగంలోనే దేశ రాజ్యాంగాన్ని కూల్చేస్తామన్న సందేశాన్ని మోడీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాల స్థాయికి కుదించారు. మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించే సిఎఎ చట్ట సవరణను తీసుకొచ్చారు. ఏక రూప పౌర స్మృతి అమలుకు చట్టాన్ని తీసుకొచ్చేందుకు యత్నించారు. ఇవన్నీ ఆరెస్సెస్ ప్రమేయం లేకుండానే బిజెపి చేసిందా?
ఈ సారి 400కిపైగా ఎంపీ సీట్లు గెలవాలని లక్ష్యంగా బిజెపి ప్రకటించడం ఆ పార్టీ శ్రేణులు అర్థం చేసుకోలేకపోయాయని, బిజెపి అతి విశ్వాసానికి ఇదొక నిదర్శనమని ఆర్గనైజర్లో రాశారు. బిజెపి నాయకులు 400కిపైగా సీట్లు లక్ష్యాన్ని ప్రకటించి, ఊహల బుడగలో ఊరేగారు. పోస్టర్లు షేర్ చేసుకుంటూ, సోషల్ మీడియాలో సెల్ఫీలు పెట్టుకుంటే సరిపోతుందా. లక్ష్యాన్ని చేరుకోవడానికి కఠోర శ్రమ చేయనవసరం లేదా అంటూ ఆరెస్సెస్కు తెలియకుండానే బిజెపి ఈ లక్ష్యాన్ని నిర్దేశించినట్లు వ్యాస రచయిత నమ్మబలికారు. నిజానికి ఇది ఆరెస్సెస్ శతవార్షికోత్సవ సంవత్సరం. మోడీ ప్రభుత్వ మూడవ టర్మ్లో 400 కిపైగా సీట్లు సాధిస్తే, ప్రస్తుత రాజ్యాంగాన్ని రద్దు చేసి భారత్ను మత రాజ్యంగా ప్రకటించాలనేది సంఘ్ పరివార్ అసలు ఉద్దేశం. మణిపూర్ ఘర్షణల గురించి మోహన్ భగవత్ ప్రస్తావిస్తూ పది సంవత్సరాల పాటు ఆ రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నదని, తుపాకీ సంస్కృతి అంతరించిందని అందరూ భావించారని అంటూ ఇప్పుడు నిప్పు రాజేయాలని అనుకున్నది ఎవరని ప్రశ్నించారు. మణిపూర్లో మైనార్టీలపై దాడులు సంఫ్‌ు పరివార్ పన్నాగంలో భాగం కాదా? మణిపూర్లో రెండు ఎంపీ స్థానాల్లోను బిజెపి ఓడిపోవడంతో మోహన్ భగవత్ అక్కడ జరిగినదానికి తమకు సంబంధం లేనట్లు మాట్లాడడం ఎవరిని వంచించడానికి?

తాజా సమాచారం

Latest Posts

Featured Videos