హొసూరు : ఇక్కడికి సమీపంలోని వేపనపల్లి వద్ద కారు అద్దాలు పగులగొట్టి రూ.10 లక్షల నగదు దోచుకున్న సంఘటన మంగళవారం జరిగింది. సంజీవి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి వేపనపల్లి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ తన
కారును నిలిపి కార్యాలయం లోపలికి వెళ్ళాడు. పనులు ముగించుకొని తిరిగి వచ్చేసరికి కారు అద్దాలు పగిలి ఉన్నాయి. కారు లోపల ఉంచిన డబ్బు సంచి లేకపోవడంతో అవాక్కయ్యాడు. ఈ సంఘటనపై బాధితుడు వేపనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.