భారీ తారాగణంతో అంతకుమించిన భారీ వ్యయంతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం కోసం జాతీయస్థాయిలో అభిమానులు,ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.తారాగణం మినహా మరే అప్‌డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు చిత్రబృందం ముఖ్యంగా రాజమౌళిపై అసహనంగా ఉన్నారు.అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త అభిమానులను తీవ్రస్థాయిలో అసహనానికి గురి చేస్తోంది.ఈ ఏడాది జులై 30వ తేదీన చిత్రం విడుదల కావడం అనుమానమని వార్తలు వినిపిస్తున్నాయి.పలు రకాల కారణాలు చిత్రానికి అడ్డంకిగా మారడంతో చిత్రీకరణ ఆలస్యమవుతోందని వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రం విడుదలను వాయిదా వేయడానికి చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు సమాచారం.