రాజమౌళి ఈగో హర్ట్ అయింది.అందుకే ప్రెస్ మీట్….

  • In Film
  • March 12, 2019
  • 194 Views
రాజమౌళి ఈగో హర్ట్ అయింది.అందుకే ప్రెస్ మీట్….

దాదాపుగా బాహుబలి సినిమాకు పెట్టినంత బడ్జెట్‌,భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కలిగిన ఎన్టీఆర్‌,చరణ్‌ కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంపై వస్తున్న ఊహాగాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టడానికి దర్శకధీరుడు రాజమౌళి గురువారం ప్రెస్‌మీట్ పెట్టి చాలా విషయాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్ట్‌ మొదలైనప్పటి నుంచి చిత్రంపై వస్తున్న ఊహాగాలను తేలిగ్గా తీసుకున్న రాజమౌళి కొద్ది రోజులు వినిపిస్తున్న ఊహాగాలను ముఖ్యంగా కథానాయికల గురించి వినిపిస్తున్న ఊహాగానాలు రాజమౌళికి విసుగు తెప్పించాయట.ఈ ఊహాగానాలు అటు రాజమౌళితో పాటు ఇటు ప్రాజెక్ట్‌పై కూడా తీవ్ర పరిణామం చూపే విధంగా ఉండడంతో వీటన్నంటికి క్లారిటీ ఇవ్వడానికి రాజమౌళి ఈ ప్రెస్‌మీట్‌ పెడుతున్నట్లు తెలుస్తోంది.చిత్రంలో చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియాభట్‌ను నటింపచేయడానికి రాజమౌళి ప్రయత్నించగా తన డేట్స్‌ ఖాళీ లేవంటూ గతంలో రాజమౌళి ఆఫర్‌ను తిరస్కరించినట్లు వార్తలు వినిపించాయి.అయితే సినిమాలో అలియాభట్‌ను ఎలాగైనా నటింపచేయాలనే కృతనిశ్చయంతో మరోసారి ప్రయత్నించారని అందుకు భారీ పారితోషకం కూడా ఆఫర్‌ చేయగా తాను డబ్బు మనిషిని కాదని ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించడం కుదరదంటూ అలియా ఖరాఖండిగా సమాధానమిచ్చిందంటూ జాతీయ మీడియాలో కూడా కోడై కూశాయి.ఈ వార్తలు రాజమౌళిని మరింత బాధించినట్లు సమాచారం.దీంతో మీడియా ముందుకు వచ్చి ఆర్‌ఆర్‌ఆర్‌పై అన్ని విషయాలు వివరించనున్నట్లు తెలుస్తోంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos