ముఖం వాచిపోయే సమాధానమిచ్చిన తారక్..

  • In Film
  • March 15, 2019
  • 199 Views
ముఖం వాచిపోయే సమాధానమిచ్చిన తారక్..

ఆర్‌ఆర్‌ఆర్‌
చిత్రంపై సామాజిక మాధ్యమాల్లో,ప్రసార మాధ్యమాల్లో వినిపిస్తున్న ఊహాగానాలకు చెక్‌ పెట్టడానికి
దర్శకుడు రాజమౌళి హీరోలు చరణ్‌,తారక్‌లతో కలసి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన
విషయం తెలిసిందే.అందులో చిత్రకథ,వర్క్‌షాప్‌,బడ్జెట్‌,బిజినెస్‌ తదితర వాటిపై మీడియా
ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు నిర్మాత దానయ్యతో పాటు రాజమౌళి,చరణ్‌,తారక్‌లు సమాధానాలిచ్చారు.అయితే
ఒక ప్రశ్న మాత్రం నలుగురిని తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.అయితే రాజమౌళి తెలివిగా
సమాధానం చెప్పినా తారక్‌ మాత్రం ఆ ప్రశ్న అడిగిన మీడియా ప్రతినిధికి ముఖం వాచిపోయే
విధంగా సమాధానమిచ్చారు.మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్న ఏంటంటే కొమురం భీం ముస్లిం పాలనలో
ఉండేవారు..అల్లూరి సీతారామరాజు బ్రిటిషర్ల పాలనలో ఉండేవారు.ఇరువురిని ఎదురించిన సీతారామరాజు,
కొమురం భీంలు హిందువులు.సినిమా విడుదలయ్యాక ప్రజలు ఎవరైనా దీన్ని మతకోణంలో చూసి వివాదం
చూస్తే పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించాడు.దీంతో అక్కడున్న ప్రతి ఒక్కరికి కోపం నశాలానికి
అంటుకుంది.అయితే కోపాన్ని నియంత్రించుకున్నారు.దీనిపై రాజమౌళి స్పందిస్తూ..ఎక్కడి నుంచి
ఎక్కడి లింక్‌ వేస్తున్నారో అర్థమవుతుందా?ఒకవేళ మీరు చెప్పినట్లు వివాదం వచ్చిందనుకుంటే
వివాదాలు ఉన్నాయని సినిమాలు తీయడం మానేయాలా? నేనైతే ఇటువంటివాటి గురించి ఆలోచించని
తెలిపారు.తారక్‌ మాత్రం కోపాన్ని నియంత్రించుకోలకపోయారు.ఇలాంటి ఆలోచనలు మనకు ఉన్నాయి
కానీ వారికి లేవు..మన ఆలోచనలు ప్రజలపై రుద్దేస్తున్నామంటూ ఘాటుగా బదులిచ్చారు.ఈ ప్రశ్న
అడిగిన సమయంలో అందుకు బదులిస్తున్న సమయంలో తారక్‌ ముఖకవలికలు చూస్తే తారక్‌కు పట్టరాని
కోపం వచ్చినట్లు అర్థమయింది.కులం,మతం తేడాలతో మనుషులను, సమాజాన్ని,పరిస్థితులను బేరీజు
వేస్తే తారక్‌కు చాలా కోపం వస్తుందని సన్నిహితులు చెబుతుంటారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos