న్యూఢిల్లీ: నరసాపురం లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణరాజును కొట్టారనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు దాఖలు చేసిన వ్యాజ్యంపై తదుపరి విచారణను అత్యున్నత న్యాయస్థానం మంగళ వారం ఆరు వారాలకు వాయిదా వేసింది. వ్యాజ్యంలో ప్రతి వాదులుగా కేవలం కేంద్రం, సీబీఐ మాత్రమే ఉండేలా వ్యాజ్యాన్ని రఘురామ తరఫు న్యాయవాది రోహత్గీ చేసిన సవరణకు కోర్టు సానుకూలంగా స్పందించింది. దీనిపై రాషష్ట్ర ప్రభుత్వ న్యాయవాది దవే అసంతృప్తి చెందారు. ఏపీ సర్కారు వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వబోమంటూ విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారిని కించపరుస్తూ, ఓ సామాజిక వర్గాన్ని, మతాన్ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణరాజుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసింది.