బాలింతపై దౌర్జన్యం

బాలింతపై దౌర్జన్యం

రాయ్పూర్: ఛత్తీస్గఢ్, కోరియా జిల్లా జనక్పూర్ బ్లాక్ ప్రభుత్వ వసతిగృహంలో ఆశ్రయం పొందుతున్న మూడు నెలల పసిబిడ్డ, తల్లిని రంగ్లాల్ సింగ్ అనే వ్యక్తి దారుణంగా ఈడ్చుకెళ్లి బయట పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమీలా సింగ్ అనే మహిళ జనక్పూర్ బ్లాక్లోని బర్వాని కన్యా ఆశ్రమం సూపరింటెండెంట్గా పని చేస్తున్నారు. అక్కడే ఆయాగా పని చేస్తున్న ఒక మహిళ తన మూడు నెలల పసి బిడ్డతో కలిసి అక్కడే ఉంటోంది. దరిమిలా సూపరింటెండెండ్ సుమీలా సింగ్ భర్త రంగ్లాల్ సింగ్ వసతి గృహానికి వెళ్లి ఆమెను వసతి గృహంలో ఎందుకు ఉంటున్నావని నిల దీశాడు.వాగ్వాదం జరిగింది. బాలింతనీ చూడకుండా ఆమెను దూషిస్తూ, మంచం మీద నుంచి కింద పడేసి దారుణంగా ఈడ్చుకెళ్లాడు. సూపరిం టెండెంట్ సుమీలా సింగ్ సమక్షంలోనే ఈ ఘోరం జరిగినా ఆమె భర్తను వారించ లేదు. ఈ అమానవీయ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనమైంది. పోలీసులు భార్యభర్తలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos