న్యూ ఢిల్లీ: నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా 69 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న రైతులకు శివసేన సంఘీభావం తెలిపింది. ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ మంగళవారం ఘాజీపూర్ ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఘాజీపూర్ భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయిత్ను కలుసుకుని సంఘీ భావాన్ని ప్రకటించారు. ఆయన వెంట పార్టీ లోక్సభ సభ్యుడు అరవింద్ సావంత్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. పార్టీ సందేశాన్నితికాయిత్కు తెలిపి సంఘీభావం ప్రకటించామని చెప్పారు. ప్రభుత్వం పద్ధతి ప్రకారం రైతులతో మాట్లాడాలన్నారు. ఇగోలతో దేశాన్ని నడపలేరని హెచ్చరించారు.