ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కార్యాలయం కూల్చి వేతతో శివసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సంజయ్ గురువారం ఇక్కడ స్పష్టీకరించారు. ‘కూల్చివేసిన బీఎంసీ-బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ను లేక మేయర్, బీఎంసీ కమిషనర్‌ను అడగాలను కుంటే ఏదైనా అడగండి’ అని వార్తా సంస్థకు తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సలహాదారు అజయ్ మెహతాకు గవర్నర్ కోషియారి ఫోన్ చేసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. కంగన ఆఫీసు కూల్చివేత, ఇతర పరిణామాలపై కేంద్రానికి నివేదిక ఇవ్వదలచారు.