హైదరాబాదు:’రొమాంటిక్’ చిత్రంలో టైటిల్ కు మించిన రొమాన్స్ ఉంటుందని తెలుస్తోంది. సందర్భానికి తగినట్టుగా దర్శకుడు అనిల్ పాదూరి రొమాన్స్ పాళ్లను పెంచుతూ వెళ్లాడని అంటున్నారు. పతాక సన్నివేశం కూడా హీరో హీరోయిన్ల లిప్ టు లిప్ కిస్ తో ముగుస్తుం దంటున్నారు.పూరి జగన్నాథ్ సొంత నిర్మాణంలో ఆయన తనయుడు ఆకాశ్ హీరోగా ఈ చిత్రం రూపొందింది. కేతిక శర్మ కథా నాయకి. రమ్యకృష్ణ , మందిరా బేడీ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.