రోల్ ఆన్-రోల్ ఆఫ్ రైలు ఈ నెల 30 నుంచి

రోల్ ఆన్-రోల్ ఆఫ్ రైలు ఈ నెల 30 నుంచి

హుబ్బళ్లి : మొట్ట మొదటి రోల్ ఆన్-రోల్ ఆఫ్ రైలు సేవలు ఈ నెల 30 నుంచి నెలమంగళ నుంచి సోలాపూర్ జిల్లాలోని బాలే వరకు ఆరంభం కానుంది. నైరుతి రైల్వేలో ఇదే తొలి రోల్ ఆన్-రోల్ ఆఫ్ రైలు. ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ సి అంగడి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ రైలును వచ్చే ఆదివారం ప్రారంభిస్తారని సీనియర్ డివిజిల్ కమర్షియల్ మేనేజర్ (బెంగళూరు డివిజన్) కృష్ణా రెడ్డి తెలిపారు. ఈ రైలు మొదటి ప్రయాణంలో వ్యవసాయ, రసాయనిక, పారిశ్రామిక సరుకుల్నిరవాణా చేస్తోందన్నారు. 43 ఓపెన్ వ్యాగన్లు ఉంటాయి. నెలమంగళ-బాలే మధ్య దూరం 682 కి.మీలు. ఈ రైలు నలభై మూడు లారీల్నితరలించగలదని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos