ఏళ్ల తరబడి ప్రేక్షకులను అలరిస్తూ బుల్లితెరపై సూపర్‌హిట్ షోగా దూసుకెళుతున్న జబర్దస్త్ కార్యక్రమం ప్రస్తుతం ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. కంటెస్టెంట్లు,టీమ్ లీడర్ల స్కిట్‌లతో పాటు న్యాయనిర్ణేతలైన నాగబాబు,రోజాల పంచ్‌లు,నవ్వులు కూడా షోను మరింత హిట్ చేశాయి.కాగా జబర్దస్త్ నుంచి నాగబాబుతో పాటు కొంతమంది టీమ్ లీడర్లు,కంటెస్టెంట్లు సైతం తప్పుకొని మరో ఛానల్‌కు వెళ్లిపోయారు. అనసూయ, చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ లాంటి వారు ఆ షోలో సందడి చేయనున్నట్లు వారు విడుదల చేసిన ప్రోమో ద్వారా తెలుస్తోంది.నాగబాబుకి అత్యంత సన్నిహితంగా ఉండే సుడిగాలి సుధీర్ టీమ్, హైపర్ ఆది కూడా.. జబర్‌దస్త్‌ని వదిలి బయటకు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో నాగబాబు జబర్‌దస్త్ టీమ్ సభ్యులందరినీ ఇంటికి పిలిచి చిన్న సైజు మీటింగు పెట్టారని సమాచారం. మల్లెమాలనీ, ఈటీవీనీ వదిలేసి రమ్మని స్వీట్ వార్నింగ్‌లాంటిది ఇచ్చారని తెలుస్తోంది.మరోవైపు రోజా కూడా మరో మీటింగ్ పెట్టిందని టాక్. జీవితం ఇచ్చిందే జబర్‌దస్త్.. దాన్ని వదిలి వెళ్తే విశ్వాసం లేనట్టే అంటూ ఎమోషనల్‌గా టచ్ చేస్తోందని టాక్. మరి నాగబాబు మాట వినాలా? రోజా మాట వినాలా? అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. జబర్దస్త్‌లోని సభ్యులందరికీ ఈ షో వల్లే లైఫ్ వచ్చిందని అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య టీమ్ లీడర్లు సతమతమవుతున్న తెలుస్తోంది.