అమరావతి: జగన్ కేబినెట్లో రోజా, విడదల రజనీలను కరప్షన్ క్వీన్లుగా తెదేపా వ్యాఖ్యానించింది. రోజా రూ.1.50 కోట్లతో కొన్న బెంజ్ కారులో పక్కన కుమారుణ్ని, వెనుక సీట్లో కూతురు, భర్తను కూర్చోబెట్టుకుని కారు నడిపారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన తెదేపా దాని పై ట్విట్టర్ లో ఓ సెటైర్ సంధించింది. ‘మంత్రి గారికి అపాయింట్మెంట్ లో బాగానే వస్తున్నట్టు ఉన్నాయి.. బాగానే వెనకేసారు రోజా కొన్న జీఎల్ఎస్- 400డీ బెంజ్ కారు విలువ రూ.1.5 కోట్లు. జగన్ కేబినెట్లో రోజా, విడదల రజనీలను కరప్షన్ క్వీన్లుగా పేర్కొంది. ఓ రౌండ్ లోగోను ఆ వీడియోకు అతికించింది. ఈ ఇద్దరు మంత్రులు తమతో అపాయింట్ మెంట్ కోసం వస్తున్న వారి నుంచి రూ.50 వేల చొప్పున వసూలు చేస్తున్నారని తెదేపా ఆరోపించింది.