సెల్ఫీ అడిగిన పారిశుద్ధ్య కార్మికులను దూరంగా నిల్చోవాలన్న రోజా

సెల్ఫీ అడిగిన పారిశుద్ధ్య కార్మికులను దూరంగా నిల్చోవాలన్న రోజా

తిరుచెందూర్: తనను సెల్ఫీ అడిగిన పారిశుద్ధ్య కార్మికులను దగ్గరకు రావొద్దన్న వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాడులోని తిరుచ్చెందూర్ సుబ్రమణియస్వామి ఆలయంలో సోమవారం నిర్వహించిన వరుషాభిషేకంలో రోజా, ఆమె భర్త సెల్వమణి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారితో సెల్ఫీలు దిగేందుకు భక్తుల్లో చాలామంది ఆసక్తి కనబరిచారు. అదే సమయంలో అక్కడున్న పారిశుద్ధ్య కార్మికులు సెల్ఫీ కోసం రోజా వద్దకు వెళ్లగా దూరంగా నిల్చోవాలని చేయి చూపిస్తూ రోజా చెప్పడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వారు కొంత దూరం జరిగి ఆమెతో సెల్ఫీ తీసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos