సెక్రటేరియట్‌లో దొంగలు పడ్డారు..మంత్రి పేషీలో హార్డ్‌డిస్క్‌లు,కీలక ఫైళ్లు మాయం..

సెక్రటేరియట్‌లో దొంగలు పడ్డారు..మంత్రి పేషీలో హార్డ్‌డిస్క్‌లు,కీలక ఫైళ్లు మాయం..

తెలంగాణ రాష్ట్ర
సెక్రటేరియట్‌లో మరోసారి దొంగలు పడ్డారు.అత్యంత భద్రత వలయం ఉన్నా పకడ్బందీగా లోపలికి
ప్రవేశించి ఓ మంత్రి కార్యాలయంలోని కంప్యూటర్లలో హార్డ్‌డిస్క్‌లు,కీలక ఫైళ్లు ఎత్తుకెళ్లారు.తెలంగాణ
శాసనసభ ఎన్నికలు జరిగిన సమయంలో జీఏడీ అధికారులు మంత్రుల కార్యాలయాలు తమ స్వాధీనంలోకి
తీసుకొని మంత్రుల కార్యాలయాలకు సీలు వేశారు.ఈ క్రమంలో సదరు మంత్రి కార్యాలయానికి కూడా
సీలు వేశారు.ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన రెండు నెలలకు సీఎం కేసీఆర్‌ చేపట్టిన
మంత్రివర్గ విస్తరణలో మంత్రిపదవి దక్కడంతో కొద్ది రోజుల క్రితం మంత్రి బాధ్యతలు స్వీకరించడంతో
మంత్రి కార్యాలయాన్ని అధికారలుఉ తెరిచారు.అయితే అందులో కంప్యూటర్లు పని చేయకపోవడంతో
ఐటీ విభాగానికి ఫిర్యాదు చేయగా కంప్యూటర్లు పరిశీలించిన ఐటీ విభాగ సిబ్బంది కంప్యూటర్లలో
హార్డ్‌డిస్క్‌లు లేకపోవడంతో విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.దీంతో కార్యాలయాన్ని
క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు కార్యాలయంలో ఉండాల్సిన పలు కీలకఫైళ్లు కూడా మాయమైనట్లు
గుర్తించారు.దీనిపై సెక్రటేరియట్‌ అధికారులు పోలీసు విచారణకు ఆదేశం ఇవ్వకుండా అంతర్గత
విచారణ చేపట్టారు.సాధారణంగా బయటి వ్యక్తులు సెక్రటేరియట్‌లోకి ప్రవేశించి మంత్రి కార్యాలయంలో
హార్డ్‌డిస్క్‌లు,ఫైళ్లు తీసుకెళ్లే సాహసం చేయరని భావించిన అధికారులు ఇది కచ్చింగా
ఇంటి దొంగల పనే అయి ఉంటుందనే కోణంలో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos