హార్దిక్‌పటేల్‌కు పోటీగా జడేజా భార్య

జామ్నగర్: క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజా వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి భాజపా అభ్యర్థిగా పాటిదార్ నేత హార్దిక్ పటేల్(కాంగ్రెస్‌)ను డీ కొననున్నారు. గుజరాత్లోని కర్నిసేన మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఉన్న రివాబా క్షత్రియ సామాజిక వర్గీయుల మద్దతుతో ఈ నెల మొదటి వారంలో భాజపాలో చేరారు. లోక్సభ ఎన్నికల్లో జామ్నగర్ నుంచి పోటీకి ఆసక్తి చూపారు. ఇందుకు కమలనాధులు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. దీంతో జామ్నగర్ లోక్సభ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. జామ్నగర్కు ప్రస్తుతం భాజపా నాయకురాలు పూనమ్ మాదమ్ లోక్‌సభలో ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పూనమ్ప్రముఖ కాంగ్రెస్ నేత, తన బంధువైన విక్రమ్ మాదమ్ను ఓడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos