రిషికేశ్:ఉత్తరాఖండ్‌లో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ వర్షాలకు రిషికేశ్ వద్ద గంగానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రిషికేశ్ లోని పరమార్థ నికేతన్ ఆశ్రయం వద్ద గంగమ్మ శివుని విగ్రహాన్ని తాకుతోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.