ఓటమిని అంగీకరించిన రిషి సునాక్‌

ఓటమిని అంగీకరించిన రిషి సునాక్‌

లండన్: బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఎగ్జిట్పోల్స్ను నిజం చేస్తూ 14 ఏండ్లపాటు అధికారం చెలాయించిన కన్జర్వేటివ్ పార్టీకి ఓటమి ఖరారైంది. కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఘన విజయం దిశగా దూసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ స్పందించారు. ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారు. ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో తన మద్దతుదారులను ఉద్దేశించి సునాక్ ప్రసంగించారు. ‘బ్రిటన్ ప్రజలు నిర్ణయాత్మకమైన తీర్పును ఇచ్చారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్కు అభినందనలు తెలియజేస్తున్నా. అధికారం శాంతియుతంగా చేతులు మారుతుంది. అది మన దేశ భవిష్యత్తు, స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుంది. ప్రజల తీర్పును గౌరవిస్తూ.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా. ఈ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు క్షమాపణలు కోరుతున్నా’ అని సునాక్ తెలిపారు.

ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో లేబర్ పార్టీ 341 సీట్లకు పైగా విజయం సాధించింది. ప్రధాని అభ్యర్థి కీర్ స్టార్మర్ గెలుపొందారు. అధ్యక్షుడు రిషి సునాక్ పార్టీ 75 స్థానాలకే పరిమితమైంది. ముందస్తు అంచనాలు లేబర్పార్టీ 410 స్థానాలు గెలుస్తుందని, కన్జర్వేటివ్ పార్టీ 131 సీట్లకే పరిమితమవుతుందని తెలిపాయి. 650 స్థానాలున్న బ్రిటన్ పార్లమెంటులో అధికారం చేపట్టడానికి 326 సీట్లు కావాల్సి ఉంటుంది. బ్రిటన్ కాలమానం ప్రకారం గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. దాదాపు 4.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఈసారి 2019తో పోలిస్తే తక్కువ పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో అది 67 శాతంగా ఉన్నది. కాగా, భారత మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు దూరపు బంధువు ఉదయ్ నాగరాజు, బ్రిటన్ ఎంపీ ఎన్నికల్లో నిలబడ్డారు. కరీంనగర్ జిల్లా కోహెడ మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు, ఆయన కుటుంబ సభ్యులు కొన్నేండ్ల క్రితం బ్రిటన్లో స్థిరపడ్డారు. ఆయన లేబర్ పార్టీ తరఫున ఉత్తర బెడ్ఫోర్డ్షైర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 45 ఏండ్ల ఉదయ్ నాగరాజ్ తన గెలుపుపట్ల విశ్వాసం వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos