ఉంగరం వేలు అలా ఉంటే కరోనా రాదంట..

ఉంగరం వేలు అలా ఉంటే కరోనా రాదంట..

కరోనా వైరస్‌ ధాటికి ప్రజలు శాస్త్రవేత్తలు,వైద్యులు చెబుతున్న సూచనలు,సలహాలు ఎలా శ్రద్ధగా వింటున్నారో జ్యోతిష్యం,సైన్స్‌ రెండు మిళితమైన ప్రచారాలు,వార్తలను సైతం అంతేస్థాయిలో వింటున్నారు.ఇవి తింటే కరోనా రాదని ఎక్కడైనా కనిపించినా,వినిపించినా చాలు వెంటనే దానికోసం పరుగులు పెడుతున్నారు.ఈ లక్షణాలు ఉన్న వారికి కరోనా రాదని చెబితే వెంటనే తమలో అటువంటి లక్షణాలు ఉన్నాయోమో తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా స్వాన్ సీ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించిన ఓ అంశం చర్చనీయాంశమైంది.ఉంగరం వేలు పొడవుగా వుండే పురుషులకు కరోనా ముప్పు తక్కువని, ఉంగరం వేలు పొట్టిగా ఉంటే కరోనా ముప్పు అధికం అని గుర్తించారు. క్రమంలో 41 దేశాలకు చెందిన పురుషుల ఉంగరం వేళ్లపై పరిశోధన నిర్వహించారు. ఉంగరం వేలు పెరుగుదలకు గర్భస్త శిశువుపై టెస్టోస్టిరాన్ ప్రభావానికి సంబంధం ఉంటుందని పరిశోధకులు వివరించారు.ఎలాగంటేగర్భంలోని పురుష శిశువు ఎంత ఎక్కువగా టెస్టోస్టిరాన్ ప్రభావానికి గురైతే ఉంగరం వేలు అంత పొడవు పెరుగుతుందట. పిండం తక్కువ మోతాదులో టెస్టోస్టిరాన్ ప్రభావానికి గురైతే ఉంగరం వేలు తక్కువ పొడవు పెరుగుతుందట.ఇక, టెస్టోస్టిరాన్ హార్మోన్ కరోనా విషయంలో ఎందుకు ప్రస్తావనకు వస్తోందంటే…. టెస్టోస్టిరాన్ హార్మోనే కరోనా నుంచి కాపాడే రక్షక కవచాలు అనదగ్గ ఏసీఈ-2 గ్రాహకాలను శరీరంలో ఉత్పత్తి చేస్తుంది. వ్యక్తికి కరోనా సోకినప్పుడు వైరస్ తాలూకు లక్షణాలు తగ్గించడంలో ఏసీఈ-2 గ్రాహకాలు ఇతోధికంగా తోడ్పడతాయి పరిశోధన ద్వారా వెల్లడైన అంశం ఏంటంటే, తక్కువ టెస్టోస్టిరాన్ స్థాయి ఉన్న పురుషులకు కరోనాతో మరణించే ముప్పు ఎక్కువట. టెస్టోస్టిరాన్ స్థాయిని ఉంగరం వేలు పొడవు ఆధారంగా అంచనా వేయొచ్చని స్వాన్ సీ వర్సిటీ పరిశోధకుల అధ్యయనం చెబుతోంది.దీంతో తమ ఉంగరవ వేలు పొడుగ్గా ఉన్న వ్యక్తులు తమకు కరోనా సోకదనే ధీమాతో ఉంటున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos